- Advertisement -
కొండా దంపతులపై కఠినచర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిశారు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య.
కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలా? మేము కావాలా? తేల్చి చెప్పండి అని డిమాండ్ చేశారు. కొండా దంపతులపై ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు.
కొండా దంపతులపై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని మల్లు రవికి ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ, కొండా మురళీ వరంగల్ లోని అన్ని నియోజకవర్గాల్లో తల దూర్చి, అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read:‘ది 100’… రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -

