సాధారణంగా పెరుగు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అందుకే వేసవిలో వేడితాపం నుంచి బయట పడేందుకు పెరుగు తింటూ ఉంటారు చాలామంది. పైగా పెరుగు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఇంకా ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అయితే చలికాలంలో పెరుగు తినడానికి చాలమంది ఆసక్తి చూపరు. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణం చల్లగా ఉండడం వల్ల పెరుగు తింటే, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పెరుగును పక్కన పెట్టేస్తుంటారు. అయితే శీతాకాలంలో కూడా ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల చలికాలంలో ఎముకల పటుత్వానికి పెరుగు దోహదం చేస్తుంది. ఇంకా వింటర్ సీజన్ లో జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువ.. ముఖ్యంగా మలబద్దక సమస్య తరచూ వేధిస్తుంది. కాబట్టి వింటర్ లో కూడా తినే ఆహారంలో పెరుగును జత చేసుకుంటే ఫ్రీ మోషన్ కు సహకరిస్తుందని చెబుతున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. ఇంకా అజీర్తి, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా పెరుగు దూరం చేస్తుంది. అయినప్పటికి పెరుగును మితంగానే తినాలని చెబుతున్నారు కొందరు నిపుణులు. ఎందుకంటే పెరుగు ఎక్కువగా తినడం వల్ల కఫం ఏర్పడే ఛాన్స్ ఉంది. అలాగే పెరుగు ఎక్కువగా తింటే ఆకలి కూడా మందగిస్తుంది. తద్వారా ఏ సీజన్ లోనైనా పెరుగు తినడం మంచిదే అయినప్పటికీ మితంగానే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:తులసి గింజలతో ఎన్ని లాభాలో..!