ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఆటగాళ్ల బదిలీలతో క్రికెట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు నలుగురు ఆటగాళ్లతో కూడిన ట్రేడ్‌ను పూర్తి చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్నారు. మరోవైపు భారత ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మారనున్నారు.
ఈ ట్రేడ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్ల ధరకు దక్కించుకుంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు తగ్గిన ధరకు సీఎస్కే జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన లివింగ్‌స్టోన్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల ఆల్‌రౌండర్. భారీ షాట్లు ఆడటంలో అతడికి మంచి గుర్తింపు ఉంది.
ఆస్ట్రేలియా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా సీఎస్కే జట్టులో చేరనున్నాడు. అతడి ప్రస్తుత ధర రూ.3 కోట్లుగానే కొనసాగనుంది. ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయకముందే సన్‌రైజర్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే పాదానికి గాయం కావడంతో ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
మరోవైపు భారత ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రూ.4.8 కోట్ల పాత ధరతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తిరిగి వస్తున్నాడు. గతంలో 2018 నుంచి 2021 వరకు ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026లో ఐదు మ్యాచ్‌లు ఆడిన అనంతరం కుడి తొడ కండరాల గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.
Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ కూడా రూ.2 కోట్ల ప్రస్తుత ధరతో హైదరాబాద్ జట్టులో చేరనున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వైవిధ్యమైన బంతులు వేయడంలో ఎల్లిస్‌కు మంచి గుర్తింపు ఉంది. టీ20 క్రికెట్‌లో అతడికి విశేష అనుభవం ఉంది.
ఈ నలుగురు ఆటగాళ్ల బదిలీతో ఐపీఎల్ 2027కు ముందే సీఎస్కే, సన్‌రైజర్స్ తమ జట్ల కూర్పులో మార్పులు చేసుకున్నాయి. రాబోయే సీజన్‌లో ఈ ఆటగాళ్లు తమ కొత్త జట్ల తరఫున ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

