ఈ నెల 22న ముగింపు వేడుకలు @ఎల్బీ స్టేడియం

23
somesh
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకులను భారీ ఎత్తున్న ప్రణాళికలు రచించింది. ఈ నెల 22వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమాలు ఏర్పాట్లును సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు పాల్గోనేందుకు ప్రత్యేక వేదిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో శంకర్‌ మహదేవన్‌, శివమణి లాంటి ప్రముఖుల సంగీత విభావరి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం కోసం దాదాపు 25వేల మందికి పైగా పాల్గోంటారని అంచనా వేశారు. ఇప్పటికే ఇంటింటా జెండా పండుగ, సామూహిక జాతీయా గీతలాపన, పాఠశాల విద్యార్థులకు గాంధీ సినిమాను ఉచితంగా రాష్ట్ర వ్యాప్త ప్రదర్శనకు ఏర్పాట్లు చేయడం లాంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేశామని ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కూమార్‌ తెలిపారు.

సీఎస్‌తోపాటు అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ పోలీస్ కమీషనర్ శర్వానంద్ , డీసీపీ ట్రాఫిక్ రంగనాధ్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ ఛీప్ గణపతి రెడ్డి, టీఎస్‌ఐసీసీ ఎండీ నరసింహారెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి తదితరులు సభా ఏర్పాట్లను పరిశీలించారు.

- Advertisement -