ముగింపు వేడుకల పనులను పరిశీలించిన మంత్రులు…

64
lb
- Advertisement -

ఈ నెల 22న భారత స్వతంత్ర్య వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకలను ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, వజ్రోత్సవాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పరిశీలించారు. 22న జరిగే ముగింపు వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ముగింపు వేడుకలకు అన్నిజిల్లాల నుంచి కనీసం రెండు వేలమంది చొప్పున పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్టేజీ ఏర్పాట్లు, చేపట్టాల్సిన చర్యలు, హాజరయ్యే వారికి కనీస మౌలిక సదుపాయాలు, సీటింగ్, తదితర ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం మొత్తం కెపాసిటీ 30వేలుగా ఉండగా వీరికి కావాల్సిన సదుపాయాల కల్పనపై సమీక్షించారు.

ఈ నెల 16న 11.30 గంటలకు నిర్వహించనున్న సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. జాతీయా గీతాలాపన సమయంలో ప్రతి రహదారిలో ట్రాఫిక్ నిలిపివేయడం జరుగుతుందన్నారు. ప్రతీ కార్యాలయం, ప్రముఖ చారిత్రక ప్రదేశాలు, అన్నింటిలో ఈ సామూహిక జాతీయ గీతాలాపనకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు.

- Advertisement -