జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష..

105
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో కలెక్టరేట్ కాంప్లెక్సెస్ నిర్మాణాల పూర్తి, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణికి సంబంధించిన విషయాలపై బిఆర్ కెఆర్ భవన్ నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 12 జిల్లాలో కలెక్టరేట్ కాంప్లేక్స్ ను వారంలోగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మిగతా జిల్లాలో కలెక్టర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణం కోసం TSIIC కి భూములు హ్యాండ్ ఒవర్ చేసేలా చర్యలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం ఇటీవల 7 జిల్లాలలో మంజూరు చేసిన నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం గుర్తించిన భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్లను సి.యస్ ఆదేశించారు.

ధరణిలో పెండింగ్ మ్యూటేషన్లు,భూవిషయాలకు సంబంధించిన గ్రీవియన్స్ మాడ్యూల్, ప్రొహిబిటరి ప్రాపర్టీలలో సమర్పించిన ధరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించి, జూన్ 9 లోగా పరిష్కరించి తద్వారా ఆ రైతులు రైతుబంధు సహాయం పొందేలా చూడాలని ఆదేశించారు. స్పెషల్ ట్రిబ్యునల్ లో పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్ లను నిర్వహించాలన్నారు.

ఈ వీడియోకాన్ఫరెన్స్ లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, సి.ఐ.జి వి. శేషాద్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, SCDD రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, Director Prohibition and Excise, సర్ఫరాజ్ అహ్మద్, TSTS MD వెంకటేశ్వర్ రావు, CCLA Spl. Officer సత్యశారద, ENC గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -