కేసీఆర్‌కు మొదటి లగ్న పత్రిక అందించిన మంత్రి వేముల..

17
Minister Prashanth Reddy

రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు ఈరోజు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు నెల 20వ తేదీన జరగబోయే ఆయన కుమరుడి పెళ్లికి సీఎం దంపతులను ఆహ్వానించారు. నాకు దైవ సమానులు మరియు పితృ సమానులు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఈ రోజు సతీసమేతంగా కలిసి, ఆగస్టు నెల 20వ తారీఖు జరగనున్న నా కుమారుడు పూజిత్ రెడ్డి వివాహ మొదటి లగ్న పత్రికను అందజేసి వారి ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.