గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సీపీ అంజనికుమార్‌..

34

పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు గోశామహల్ పోలీస్ గ్రౌండ్‌లో నగర సిపి అంజనికుమార్, ఆడిసినల్ సిపి,క్రైం సికాగోయల్,ఏ ఆర్.శ్రీనివాస్,గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిపి అంజనికుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా హైద్రాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. గ్రీన్ ఛాలెంజ్ అనేది పెద్దఎతున్న తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇది ఎంపీ సంతోషకుమార్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు.

ఈకార్యక్రమం ప్రారంభించిన సంతోష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నేను ఇప్పటి వరకు 10సారి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాను. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రతి ఒక్కరు స్వీకరించి మొక్కలు నటినచో పచ్చని తెలంగాణగా మారి,స్వచ్ఛమైన గాలి,వాతావరణం ఏర్పడుతుందని సిపి అంజనికుమార్ పేర్కొన్నారు.