ముఖ్యమంత్రి దృష్టికి ఉద్యోగుల ప్రతిపాదనలు: సీఎస్‌ సోమేశ్ కుమార్

112
cs somesh
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ 3 ఉద్యోగుల సంఘాల ఆఫీసు బేరర్లతో , తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ నాన్ – గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ లతో బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం అయింది.

పిఆర్సి సిఫార్సులు మరియు ఇతర సమస్యలకు సంబంధించి 3 ఉద్యోగుల సంఘాలు మరియు వారి అభిప్రాయాలను మరియు ప్రతిపాదనలు త్రిసభ్య కమిటీ అసోసియేషన్ వారీగా విన్నారు. పిఆర్సి సిఫార్సులు మరియు ఇతర సంబంధిత విషయాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రజత్ కుమార్, వివిధ ఉద్యోగుల సంఘాల ఆఫీస్ బేరర్లు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి వి.మమత, జనరల్ సెక్రెటరీ శ్రీ ఎ.సత్యనారాయణ, శ్రీ యం.బి.క్రిష్ణ యాదవ్, TNGOs ప్రెసిడెంట్ శ్రీ యం.రాజేందర్ , వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి రేచల్ , సిటీ ప్రెసిడెంట్ శ్రీ ముజిబ్ , జనరల్ సెక్రెటరీ శ్రీ యం.ప్రతాప్ , సెక్రటేరియట్ ఆఫీసర్స్ మరియు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ యం.నరెందర్ రావు, జనరల్ సెక్రెటరీ శ్రీ లింగ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -