ఇటీవలే గుజరాత్‌లో పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా రానున్న ఎన్నికల్లో జామ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి హార్దిక్‌ను బరిలోకి దింపాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీజేపీ తరపున జామ్ నగర్ లోక్ సభ అభ్యర్థిగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాను బరిలోకి దించే ఆలోచనలో ఉన్నారు బీజేపీ అధ్యక్షుడు అమీత్ షా.
ఇక గుజరాత్‌లోని కర్నిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న రివాబా.. క్షత్రియ వర్గీయుల మద్దతుతో ఇటీవలే భాజపాలో చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్ సీటు ఆమె ఆశిస్తున్నారు. గుజరాత్‌లో గత ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది.
రానున్న ఎన్నికల్లోనూ బలమైన నాయకులను దింపి మరోసారి క్లీన్‌స్వీప్ చేయాలని బీజేసీ పార్టీ యోచిస్తోంది. భాజపా నేడు లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అటు కాంగ్రెస్ కూడా భాజపాకు దీటైన నాయకుల కోసం వ్యూహాలు రచిస్తోంది. దీంతో జామ్‌నగర్ లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.