ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుసై స్పష్టత ఇచ్చాడు ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్. గబ్బా టెస్టుకు కామెరున్ బెన్‌క్రాఫ్ట్,మైఖేల్ నేసిర్ దూరం అవుతున్నారని చెప్పారు. బెన్‌క్రాఫ్ట్ స్ధానంలో జో బర్న్స్ జట్టులోకి రానున్నాడని చెప్పాడు.
డేవిడ్ వార్నర్‌తో కలిసి బర్న్స్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని లాంగర్ చెప్పారు. దీంతో జో బర్న్స్ టెస్టు ఆరంగేట్రం జరగనుండగా ట్రావిస్ హెడ్,మార్నస్ లాబుస్‌చెంగ్,స్టీవ్ స్మిత్,మాథ్యు వెడ్ మిడిల్ ఆర్డర్‌లో ఉండటం ద్వారా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉందని చెప్పారు.
వార్నర్-బర్న్స్ కాంబినేషన్‌తో ఆసీస్ భారీ స్కోరు సాధించగలదని చెప్పాడు. బర్న్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ 47.25గా ఉందని…వార్నర్ కూడా బర్న్స్‌తో బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడతాడని వెల్లడించాడు లాంగర్.
జట్టు అంచనా: డేవిడ్ వార్నర్, జో బర్న్స్,లాబుస్‌చేంజ్,స్టీవ్ స్మిత్,ట్రావిస్ హెడ్,మాథ్యు వెడ్,టీమ్ పైని(కెప్టెన్,వికెట్ కీపర్),ప్యాట్ కమ్మిన్స్,మిచెల్ స్టార్క్,నాథన్ లయన్,హజల్ వుడ్.
Australia coach Justin Langer has all but confirmed Cameron Bancroft and Michael Neser will miss out on Test selection at the Gabba