ఐపీఎల్ 14…ఆసీస్ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్

183
IPL-franchisees
- Advertisement -

ఐపీఎల్ 14వ సీజన్ కోసం ఇప్పటినుండే రంగం సిద్ధమవుతోంది. ఈసారి భారత్‌లో ప్రేక్షకుల మధ్య జరిగే ఐపీఎల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కొత్త జట్లు రానుండగా విదేశీ ఆటగాళ్లకు ఒక్కొక్క బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ఐపీఎల్‌-2021 సీజన్‌లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లను అనుమతిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) తాత్కాలిక సీఈవో నిక్‌ హాక్లీ తెలిపారు. స్వతంత్ర ప్రాతిపదికన ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు బోర్డు నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) మంజూరు చేస్తుందని హాక్లీ వెల్లడించారు.

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో 19 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొనగా ఈ సారి భారత్‌లో జరిగే ఐపీఎల్‌లో ఆటగాళ్లకు గాయాల సమస్యలు ఉంటే తప్ప, ఎన్‌వోసీలు మంజూరు చేయడంలో ఎలాంటి సమస్య ఉండదని సీఏ వెల్లడించింది.

- Advertisement -