పీఎంవోలోకి అమ్రపాలి

140
amra pali

2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి అరుదైన అవకాశం లభించింది. ప్రధానమంత్రి కార్యాలయం డిప్యూటీ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. పీఎంవోలో కొత్తగా ముగ్గురు ఐఏఎస్‌లను నియమితులు కాగా అమ్రపాలితో పాటు 2004 కేడర్‌కు చెందిన రఘురాజ్‌ రాజేంద్రన్‌,2012 కేడర్‌కి చెందిన మంగేష్ గిల్దియాల్ ఉన్నారు

అమ్రపాలి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు అమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా తర్వాత రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. వరంగల్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రజల మన్ననలు పొందారు.

ఐఏఎస్ రఘురాజ్ రాజేంద్రన్‌ స్టీల్,పెట్రోలియం,సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రైవేట్ సెక్రటరీగా సేవలందించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ మంగేష్ గిల్దియాల్ పీఎంవో అండర్ సెక్రటరీగా నియమితులయ్యారు.