కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ , గత రెండు ఆర్థిక సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ రంగానికి అసాధారణ తోడ్పాటునందించిన తమ సభ్యులను గుర్తించేందుకు క్రెడాయ్ తెలంగాణ రియాల్టీ అవార్డులు ‘క్రియేట్ – 2019’ను నిర్వహిస్తుంది. క్రియేట్ 2019 (క్రెడాయ్ రియల్ ఎస్టేట్ అవార్డ్స్ ఫర్ తెలంగాణ ) అనేది క్రెడాయ్ తెలంగాణా సృష్టించిన వేదిక. క్రెడాయ్ తెలంగాణా మార్గనిర్దేశకత్వంలో పలు అవార్డులను రియల్ ఎస్టేట్ కార్యకలాపాలలో వైవిధ్యమైన కోణాలను ప్రదర్శించిన సభ్యులకు అందజేస్తారు. క్రియేట్ – 2019 లోగోను హైదరాబాద్ లో క్రెడాయ్ తెలంగాణ ఛైర్మన్ శ్రీ జి.రామ్ రెడ్డి; క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ సీహెచ్ రామచంద్రారెడ్డి ; ప్రెసిడెంట్-ఎలక్ట్ శ్రీడి మురళీ కృష్ణారెడ్డి ; సెక్రటరీ శ్రీ ఈ ప్రేమ్ సాగర్ రెడ్డి ; ఉపాధ్యక్షులు శ్రీ కె ఇంద్రసేనారెడ్డి , శ్రీ జి. అజయ్ కుమార్, శ్రీ సి.జగన్‌మోహన్, శ్రీవి మధుసూదన్ రెడ్డి మరియు జాయింట్ సెక్రటరీలు శ్రీ గోపాల్ పంచారియా, శ్రీ పల్లెర్ల రాజు, శ్రీ వై సైదీశ్వర్ రావు మరియు క్రెడాయ్ తెలంగాణ ట్రెజరర్ శ్రీ బి. పాండురంగారెడ్డి ; ఇతర సభ్యులు మరియు అతిథుల సమక్షంలో ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలోని విభిన్నవిభాగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన ప్రాజెక్టులను గుర్తించి అందజేస్తున్న వినూత్నమైన అవార్డు క్రియేట్ 2019. హైదరాబాద్ తో పాటుగా ఇతర జిల్లా చాప్టర్లు అయినటువంటి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, కొత్తగూడెం లోని సభ్యులకు ఈ అవార్డులను అందజేయనున్నారు. సుప్రసిద్ధ రేటింగ్, రీసెర్చ్ ఏజెన్సీ క్రిసిల్ ను క్రియేట్ 2019కు నాలెడ్జ్ పార్టనర్‌గా నియమించారు. ఈ సందర్భంగా శ్రీ జి.రామ్ రెడ్డి, ఛైర్మన్-క్రెడాయ్ తెలంగాణ మాట్లాడుతూ “రియల్ ఎస్టేట్ గొంతుక క్రెడాయ్. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన విధాన నిర్ణయాలు, మార్గనిర్దేశకాలను రూపొందించడంలో ప్రభుత్వంతో అతి సన్నిహితంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. అభివృద్ధి పథంలోని రాష్ట్రం తెలంగాణా. వ్యాపార అనుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. రాష్ట్ర అభివృద్దిలో రియల్ ఎస్టేట్ రంగం కీలకంగా ఉండటంతో పాటుగా ఆదాయం , ఉపాధి కల్పన పరంగా కీలకపాత్ర పోషిస్తుంది. రియల్ ఎస్టేట్ కార్యక్రమాలలో 90%కు క్రెడాయ్ సభ్యులు తోడ్పాటునందిస్తుండటమే కాదు ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తూ వృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. నిర్మాణ రంగంలో వివిధ అంశాలలో
అత్యుత్తమను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అత్యుత్తమ డెవలపర్లు (క్రెడాయ్ సభ్యులు)ను గుర్తించాలనుకుంటున్నాం. రెండవ ఎడిషన్ క్రియేట్ 2019-క్రెడాయ్ తెలంగాణ రియాల్టీ అవార్డులు ద్వారా దీన్ని చేస్తున్నాం . క్రియేట్ – 2019 అవార్డుల వేడుక డిసెంబర్ 28, 2019 వ తేదీన జరుగుతుంది. ఈ వేడుకలో 750 మంది విశిష్ట అతిథులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు, డెవలపర్లు, వెండార్లు తదితరులు పాల్గొననున్నారు” అని అన్నారు.
సీహెచ్ రామచంద్ర రెడ్డి, అధ్యక్షులు, క్రెడాయ్ తెలంగాణ మాట్లాడుతూ “తెలంగాణాలో రియల్ ఎస్టేట్ రంగంలో వేగవంతంగా వృద్ధి చెందుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దేశంలోని ఇతర ప్రాంతాల మార్కెట్ల కన్నా కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ స్వీకరణ వేగవంతంగా ఉండటంతో పాటుగా కార్పోరేట్ రియాల్టీ బూమ్ కొనసాగుతుంది. ఈ నగరం ఇప్పుడు అమజాన్ యొక్క అతిపెద్ద క్యాంపస్ ఫెసిలిటీని ఆకర్షించడంతో పాటుగా ఒప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను సైతం ఆకర్షించింది. ఐటీ మరియు ఐటీ సంబంధిత రంగాలలో అసాధారణ వృద్ధితో పాటుగా రెసిడెన్షియల్ కారిడార్స్ లో కూడా ఈ వృద్ధి కనిపిస్తుంది. అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఈ రంగంలో, పెరుగుతున్న డిమాండ్ ను ఆకట్టుకోవడానికి నాణ్యత మరియు ఆవిష్కరణ పరంగా నూతన మార్గాలను అన్వేషిస్తున్నారు. రియాల్టీ పరంగా నూతన అసాధారణ ప్రమాణాలు ఏర్పాటుచేయడం ద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటునందించిన రియల్ ఎస్టేట్ కంపెనీలను గుర్తించి, గౌరవించ కార్యక్రమం క్రియేట్ 2019. రాష్ట్రంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన గృహాలను అందించేందుకు సాంకేతికతపై ఆధారపడి సృజనాత్మకతను చూపుతున్న రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సూక్ష్మబుద్ధిని ప్రభావవంతంగా హైలెట్ చేసే కార్యక్రమం క్రియేట్ 2019. విజయవంతంగా మేము గతంలో క్రియేట్ అవార్డుల మొదటి సంచికను నిర్వహించాం. ఈ సీజన్లో మరింత ఉత్తమమైన స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.
డి. రామకృష్ణా రెడ్డి, ప్రెసిడెంట్-ఎలక్ట్, క్రెడాయ్ తెలంగాణ మాట్లాడుతూ “తెలంగాణా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం సుదీర్ఘకాలంగా వృద్ధిని నమోదుచేస్తూనే ఉంది. ఇక్కడ డెవలపర్లు అధికంగా నాణ్యతను అభివృ ద్ది చేయడం, అత్యాధునిక సాంకేతికతను స్వీకరించడం, ఉత్పత్తిలో సమర్థతను మరియు నాణ్యతను నిర్మించడం, సేవల పరంగా సమర్థత పై అధికంగా దృష్టి సారిస్తున్నారు. ఈ అంశాలే దేశంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు తోడ్పాటునందించేందుకు తోడ్పాటునందిస్తుంది. క్రియేట్ అవార్డులును క్రెడాయ్ తెలంగాణా నేపథ్యీకరించింది. సమాజం, పరిశ్రమకు సానుకూలంగా తోడ్పాటునందించే రియల్ ఎస్టేట్ రంగంలో అసాధారణ సంస్థలను గుర్తించడంతో పాటుగా సృజనాత్మకత, ఆవిష్కరణలను స్ఫూర్తినందించడం మరియు శ్రేష్టత యొక్క సరిహద్దులను మరింతగా విస్తరించడాన్ని ప్రేరేపించే రీతిలో ఈ అవార్డులను తీర్చిదిద్దారు…” అని అన్నారు. క్రియేట్ అవార్డులు 2019 గురించి మరింత వివరంగా శ్రీ ఈ.ప్రేమ్ సాగర్ రెడ్డి, సెక్రటరీ, క్రెడాయ్ తెలంగాణ మాట్లాడుతూ ” రెండవ ఎడిషన్ క్రెడాయ్ రియల్ ఎస్టేట్ తెలంగాణ అవార్డులు క్రియేట్ 2019ను వెల్లడిస్తుండటం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. బిల్డర్లకు ఇవి ఆస్కార్ అవార్డుల్లాంటివి. క్రెడాయ్ తెలంగాణా వ్యాప్తంగా డెవలపర్ సభ్యులు 11 చాప్టర్లలో ఉన్నారు. వీరంతా కూడా అవార్డులులో పాల్గొనడంతో పాటుగా 13 విభాగాలలో తమను తాము నామినేట్ చేసుకోవచ్చు. ఇతర చాప్టర్ల సభ్యులు ఏడు విభాగాలలో నామినేట్ చేసుకోవచ్చు. ఈ నామినేషన్లను జ్యూరీ సమీక్షించడంతో పాటుగా అత్యుత్తమ అర్హతలు కలిగిన వారికి క్రియేట్ 2019 అవార్డులను డిసెంబర్ 28, 2019 వ తేదీన జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించబోయే వేడుకలో అందజేయనున్నాం. ఈ అవార్డులను పలు విభాగాలలో అందించే తీరు కారణంగా తమ సంబంధిత ప్రాంతాలలోని సభ్యులందరూ అత్యుత్తమంగా పోటీపడేందుకు తగిన అవకాశం లభిస్తుంది. అదే సమయంలో సభ్యులందరికీ తమ వర్క్ ను సైజ్, తమ ప్రాజెక్ట్ తో సంబంధం లేకుండా ప్రదర్శించుకునే అవకాశమూ లభిస్తుంది..” అని అన్నారు.
క్రెడాయ్ : దవాయిస్ ఆఫ్ ఇండియాస్ రియల్ స్టేట్ ఇండస్ట్రీ గురించి : కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ అనేది ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ల అపెక్స్ బాడీ. 11 చాప్టర్లు ద్వారా 650 మందికి పైగా డెవలపర్లకు క్రెడాయ్ ప్రాతినిధ్యం వహిస్తుంది. క్రెడాయ్ యూత్ వింగ్ లో 150 మందికి పైగా సభ్యులు ఉన్నారు. తెలంగాణ లోని సుప్రసిద్ధ రియాల్టర్లు మరియు డెవలపర్లు తెలంగాణ తెలంగాణాలో భాగంగా ఉన్నారు. దీనియొక్క పలు కార్యక్రమాలు మరియు పథకాలు డెవలపర్లు ఏకం కావడంలో సహాయపడటంతో పాటుగా అత్యున్నత విధానాల వైపు వెళ్లేందుకు, కస్టమర్ సేవల అభివృద్ధి బలీయమైన రియాల్టీ పరిశ్రమకు దోహడపడుతుంది.