తెలంగాణకు ఐదు అవార్డులు

411
telangana
- Advertisement -

గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్ర్వము 2018-19 సంవత్సరములో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు గాను జాతీయ స్థాయిలో ఐదు (5) అవార్డులను కైవసం చేసుకున్నది. ఈ అవార్డులను ఇవాళ తెలంగాణ ప్రభుత్వము తరపున .ఎం. రఘునందన్ రావు,ఐ‌ఏ‌ఎస్, కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖ మరియు సంబంధిత అధికారులు ఎన్‌ఆర్‌ఎస్‌ఏ ప్రాంగణము, పూస, న్యూ డిల్లీ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ అమర్జీత్ సిన్హా, ఐ‌ఏ‌ఎస్ మరియు కేంద్ర గ్రామీణాభివృద్దిశాఖ మంత్రివర్యులు నరేంద్రసింగ్ తోమార్ చేతుల మీదుగా అందుకున్నారు.

ముఖ్యముగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకములో భాగముగా మిషన్ వాటర్ కన్సర్వేషన్ కార్యక్రమాలు అమలు చేయుటములో తెలంగాణ రాష్ట్రము ముందంజ లో ఉంధి,అంధుకు గాను జాతీయ స్థాయిలో రెండవ స్థానము దక్కించుకోవడమైనది. ఈ అవార్డును శ్రీ.ఎం. రఘునందన్ రావు,ఐ‌ఏ‌ఎస్, కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖ అందుకున్నారు.

ఉపాధి హామీ పధకము అమలులో కూలీలకు ఎక్కువ సగటు పనిదినాలు కల్పించి, పధకములో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడములో అత్యున్నత ప్రతిభ కనబరచిన జిల్లాలలో జాతీయస్థాయిలోనే నాల్గవ మరియు ఐదవ స్థానాలను వరుసగా రాజన్న సిరిసిల్ల మరియు సిద్దిపేట జిల్లాలు దక్కించుకున్నాయి. ఈ అవార్డును రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్,ఐ‌ఏ‌ఎస్ గారు మరియు డి‌ఆర్‌డి‌ఓశ్రీ.కౌటిల్యరెడ్డి గారు, మరియు సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకటరామి రెడ్డి,ఐ‌ఏ‌ఎస్ , మరియు డి‌ఆర్‌డి‌ఓ సి‌హెచ్. గోపాల్ రావు అందుకున్నారు.

అదేవిధముగా,గ్రామాభివృద్దికి గాను ఉపాధి హామీ పథకము ద్వారా కల్పించే ప్రయోజనాలను ఉపయోగించుకొని అభివృద్ది చెందిన గ్రామాల విభాగములో వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట్ మండలం లింగంపల్లి గ్రామము జాతీయ స్థాయి అవార్డును కైవసం చేసుకోవడమైనది. ఈ అవార్డును ఆ గ్రామ సర్పంచ్ ఎస్.నర్సింహులు గారు అందుకున్నారు.

మరియు, శ్యాంప్రసాద్ ముఖర్జి రుర్బన్ మిషన్ కార్యక్రమము లో భాగముగా జియో-స్పేషియల్ ప్లానింగ్ ను అన్నిరూర్బన్ క్లస్టర్లలో దేశములోనే అందరికంటే ముందు పూర్తిచేసినందున జాతీయ స్థాయి అవార్డును కైవసం చేసుకోవడమైనది. ఈ అవార్డును ఎం.రఘునందన్ రావు,ఐ‌ఏ‌ఎస్, కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖ గారు, జి.వీరా రెడ్డి, జాయింట్ కమీషనర్, రూర్బన్ మిషన్ గారు, మరియు పి. రవీందర్,ఎస్‌టి‌ఈ(జి‌ఐ‌ఎస్-రూర్బన్) అందుకున్నారు.

- Advertisement -