కాంగ్రెస్‌ది నమ్మక ద్రోహం:సీపీఎం తమ్మినేని

59
- Advertisement -

నమ్మిన వారిని నట్టేట ముంచడమే కాంగ్రెస్ పని. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్‌ పొత్తుపై ఎటు తేల్చకపోవడంతో ఒంటరిపోరుకు సిద్ధమైంది సీపీఎం. 17 స్థానాల్లో పోటీ చేస్తామని త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించింది. స్నేహ ధర్మాన్ని విస్మరించి వామపక్షాలను అవమానించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు లేదని తేల్చిచెప్పారు.

పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ ఎక్కడా పాటించలేదని… అనివార్య పరిస్థితుల్లోనే సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలువకూడదనేది మా పార్టీ విధానం అన్నారు. సీపీఎం పోటీ చేయని స్థానంలో బీజేపీకి కాకుండా ఇతర అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు.

- Advertisement -