బీజేపీ మళ్లీ వస్తే దేశం సర్వనాశనం:డి.రాజా

338
- Advertisement -

2024లో బీజేపీ అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచార సభలో మోదీ అమిత్‌షా ప్రసంగాలను పరిశీలిస్తే ఆ నేతల్లో నిరాశ భయాందోళనలు మొదలైనవి అన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళపల్లి శ్రీనివాస్ రావు అధ్యక్షతన మగ్దూం భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయిన డి.రాజా. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ… బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తి నేప‌థ్యంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతాయ‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింద‌న్నారు. త్వరలో జరిగే త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు.

బీజేపీ మరోసారి అధికారంలో కొనసాగితే దేశ వినాశనం తప్పదని హెచ్చరించారు. కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తానని తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, అందుకు భిన్నంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ నిరంకుశ విధానాలను అమలు పరుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని వినాశనం దిశగా తీసుకుపోతున్నారని మండిపడ్డారు.

జాతీయ స్థాయిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఫాసిస్టు శక్తులను ఏకాకిని చేసి 2024 ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, శక్తులు, ప్రాంతీయ పార్టీల ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని రాజా చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే రాజకీయ అవగాహనతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తుల అమ్మకం షురూ!

తెలంగాణలో జాకీ గార్మెంట్‌…కేటీఆర్‌

ట్విట్టర్ బ్లూటిక్..అప్‌డేట్

- Advertisement -