- Advertisement -
ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై మండి పడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రేపటి ఫలితాల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఆయన మీడిమాతొ మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత మోదీని సినిమా ఇండస్ట్రీలోకి పంపిస్తామి, ఇక ఆయన సినిమాల్లో వేశాలు వేసుకొవచ్చని ఎద్దేవా చేశారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి భారీగా సీట్లు తగ్గుతాయని జోస్యం చెప్పారు. తమతోనే కలిసి ఉండకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మోదీ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
- Advertisement -