కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిః నిజామాబాద్ కలెక్టర్

198
Nijamabad Collector

రేపు జరగుబోయే పార్లమెంట్ ఎన్నికల కౌటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు నిజామాబాద్ కలెక్టర్ ఎంఆర్ రావు.. కేంద్ర ఎన్నికల సంఘం విజ్నప్తి మేరకు 36 టేబుళ్లకు అనుమతి లభించిందన్నారు. కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. అభ్యర్దులు ఎక్కువమంది ఉండటం వల్ల ఖచ్చితత్వంతో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే అధికారులకు కౌంటింగ్ పట్ల అవగాహన కల్పించాం..కౌంటింగ్ హాట్ లోపలికి వచ్చే వారు ఎవరూ లోపలికి సెల్ ఫోన్లు తీసుకురాకూడదని సూచించారు.

అన్ని చోట్లా ఎలాగు రిజల్ట్ వస్తాయో నిజామాబాద్ రిజల్ట్ కూడా త్వరగానే వస్తాయి.ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 2 హాళ్లు కేటాయించాము. నిజామాబాద్ అర్బన్ రూరల్ 8 రౌండ్లు, జగిత్యాల సెగ్మెంట్లో 8 రౌండ్లు, బోధన్, బాల్కొండ సెగ్మెంట్లో 7 రౌండ్లు, ఆర్మూర్ సెగ్మెంట్లో 6 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత మొదటి రౌండ్ రెండున్నర గంటల సమయం పడుతుందన్నారు.