క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన చాడ

302
- Advertisement -

భార‌త్ చైనా స‌రిహ‌ద్దులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రుడైన క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. సూర్య‌‌పేట‌లోని సంతోష్ బాబు నివాసానికి వెళ్లిన చాడ వెంక‌ట్ రెడ్డి ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. ఈసంద‌ర్భంగా చాడ వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట వాసిగా కల్నల్ స్థాయికి ఎదిగిన సంతోష్ తెలంగాణకే గర్వకారణం అన్నారు. ఓధి నిర్వహణలో సంతోష్ ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు.

క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌లం చెందింద‌న్నారు. లాక్ డౌన్ ఫ్రీ చేయడం వల్ల విచ్చలవిడిగా కేసులు పెరుగుతున్నాయ‌న్నారు. కేంద్రం, రాష్ట్రాలకు సరైన ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు. ప్ర‌ధాని మోదీ ఆత్మ నిర్బ‌ర్ పేరుతో రూ.20ల‌క్ష‌ల కోట్లు ప్ర‌క‌టించార‌ని..అది ఆత్మ క్షోభించేలా ఉంద‌న్నారు చాడ వెంక‌ట్ రెడ్డి.

- Advertisement -