రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు: సీపీ మహేష్ భగవత్

132
mahesh
- Advertisement -

కల్తీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ హెచ్చరించారు. హయత్ నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాల షాపులపై దాడులు చేశామని తెలిపారు.

హయత్‌నగర్‌లోని పసుమాముల గ్రామంలో నకిలీ విత్తనాలు 60 లక్షల సీజ్ చేశామని తెలిపారు. పత్తి, మిర్చి, వేరుశెనగ ఏక్స్పెర్ డేట్ ముగిసినా విత్తనాలు విక్రయిస్తున్నారని తెలిపారు. గారినేని పాని గోపాల్ యజమానిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు.

గత నాలుగు సంవత్సరాలుగా 10 మందిపై పిడి యాక్ట్ నమోదు చేశామన్నారు. ఎస్వోటి టీమ్‌తో పాటు అగ్రీకల్చరల్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించామని చెప్పారు. గోపాల్‌పై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు.

- Advertisement -