మరింత కఠినంగా తనిఖీలు: సీపీ మహేశ్ భగవత్

110
cp
- Advertisement -

నేటి నుండి చెక్ పోస్టుల దగ్గర తనిఖీలను మరింత కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు సీపీ మహేశ్‌ భగవత్. గురువారం రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 షీ టీమ్ స్కూటీలను , ఒక అంబులెన్సును సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్‌ భగవత్…
లాక్‌డౌన్ ఎలా ఉందో చూడటానికి, సరదాగా తిరగడానికి రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఉదయం 10 తర్వాత చాలా పకడ్భందిగా లాక్‌డౌన్ అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 21 వేల కేసులు నమోదు అయ్యాయని, 6000 వరకు మాస్కులు లేని కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ పాస్ అప్లై చేస్తే ఎమర్జెన్సీని బట్టి మూడు రోజుల కోసం పాస్ ఇవ్వబడుతుందన్నారు.

ఎమర్జెన్సీ వెహికల్స్‌కు ఎవరు ఇబ్బంది కల్గించవద్దని….. మానసికంగా సమస్యలు ఉన్నవారు కూడా రాచకొండ కమిషనరేట్‌కు కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చన్నారు. బాల్య వివాహాలు జరిపితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -