డాక్టర్స్ సేవలు వెలకట్టలేనివి: నిరంజన్ రెడ్డి

32
niranjan reddy

కరోనా ఆపత్కాలంలో డాక్టర్స్ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు. ఎంతో సురక్షితమైన ప్రభుత్వ దవాఖానలో వైద్యులు చక్కని చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన పని లేదని రోగులకు మంత్రి ధైర్యం చెప్పారు. మనో ధైర్యాన్ని మించిన మందు లేదని..ధైర్యంగా ఉన్నప్పుడే మందులు బాగా పనిచేస్తాయని మంత్రి సూచించారు.

కొవిడ్ బారినపడి అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవని ఆయన కొనియాడారు.