బర్త్ డే…మొక్కలు నాటిన సీపీ మహేష్ భగవత్

84
mahesh

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ . రానున్న 2 నెలల్లో తమ కమిషనరేట్ పరిధిలో 20వేల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు.

తన పుట్టినరోజును పురస్కరించుకుని నేరేడ్మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.ఈ సందర్భంగా కమీషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు.

రానున్న రెండు నెలల్లో మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి, యాదాద్రి పోలీస్ కమిషనరేట్ స్థలంలో 20 వేల మొక్కలను మా కమిషనరేట్ పోలీస్ సిబ్బంది సహకారంతో నాటాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిపి శిల్ప వల్లి ఎస్టేట్ ఆఫీసర్ విజయ్ ఆనంద్ మిగతా సిబ్బంది పాల్గొన్నారు.