మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ప్రజల సొమ్ము తో బ్యాంక్ లను నడుపుతున్న కూడా నిబంధనలు పాటించక పోవడం , నిర్లక్ష్యం చేయడం తోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాన హ్యాకర్ దేశంలో లేడు.. ఎక్కడ ఉన్నాడో తెలియదని తెలిపిన సీపీ….ఈ కేసులో ఇప్పటివరకు 24 మంది హ్యాకర్ లను అరెస్ట్ చేశామన్నారు.
ఏ కేసుకు కాని ఖర్చు దీనికి అయింది. TA ,DA కలిపి ఈ కేసులో 58 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యిందన్నారు. ఐపీ అడ్రెస్ లతో ఉన్న ప్రధాన హ్యాకర్ ను అరెస్ట్ చేయాలి. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి నిందితుడిని పట్టుకొస్తాం అన్నారు.
నవంబర్ నెలలో మహేష్ బ్యాంక్ 200 మంది ఉద్యోగులకు ఫిషింగ్ మెయిల్స్ హ్యాకర్ పంపాడు.ఇద్దరు ఉద్యోగులు మెయిల్ ఓపెన్ చేయగానే..హ్యాకింగ్ కు సులువు అయిందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకోవాలి..కానీ మహేష్ బ్యాంక్ అలాంటిది ఏమి లేదన్నారు.మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల హ్యాకింగ్ చేయడం సులువు అయిందని తెలిపారు. ఐపి అడ్రస్ లు కెనడా నుంచి పాట్నా- పాట్నా నుంచి యూకే అని ఫేక్ అడ్రస్ లు ఇచ్చారని తెలిపారు సీవీ ఆనంద్.