మాచర్ల నియోజకవర్గం…ఫస్ట్ ఎటాక్

55
Macherla Niyojakavargam First Attack
- Advertisement -

యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. నితిన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ ఎటాక్‌ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్‌. టీజర్‌లో నితిన్‌ని ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 8న థియేటర్‌లలో విడుదల కానున్నది.

టీజర్ చూస్తుంటే సినిమాలో ఏదో పండగ సమయంలో జరిగిన గొడవ అన్పిస్తోంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కథానాయికలుగా కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా కనిపించనున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రేష్ట్ మూవీస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -