బ్లాక్ లో,బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను అమ్ముతున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ లను అధిక ధరకు విక్రయిస్తున్న రెండు ముఠాల అరెస్ట్ చేసాం అన్నారు.
రెండు ముఠాల్లో 9 మందిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.మరో వ్యక్తి పరారీలో ఉన్నారని…28 ఆంపోటేరిసిన్- బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు. 7858 ఇంజెక్షన్స్,7400వందల ఇంజెక్షన్లు ఒక్కో ఇంజెక్షన్ ను 35వేల నుంచి 50వేలకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.
మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తున్న శ్రీకాంత్ సహా 9 మంది అరెస్ట్ చేశామపి..బంజారాహిల్స్, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.28 అంపోటేరిసిన్ ఇంజెక్షన్స్ స్వాధీనం చేసుకున్నాము..రెండవ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు బాలస్వామి కొత్త పేట్ వాసి గా గుర్తించామన్నారు.ఆంధ్రప్రదేశ్ కు చెందిన వినోద్ పరారీలో ఉన్నాడు..బ్లాక్ మార్కెట్ లో ఇంజెక్షన్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.