- Advertisement -
రాష్ట్రాలకు గుడ్ న్యూస్ తెలిపింది సీరం ఫార్మా. ఆ సంస్థ తయారు చేస్తున్న కోవిషీల్డ్ ధరను 25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసుకు రూ.300కే అందిస్తామని ప్రకటించిన ఇది కేంద్రానికి అందించే ధర కంటే ఎక్కువ.
మొదట్లో డోసును రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు ప్రైవేట్ ఆస్పత్రులకు అయితే రూ.600కు ఇస్తామని ప్రకటించింది సీరం. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కోవిషీల్డ్ ధరను 25 శాతం తగ్గించి రూ.300కే డోసును ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ఇక భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు మోతాదుకు 600 రూపాయలు మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు 1,200 రూపాయలుగా నిర్ణయించింది. మరి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తుందో లేదో చూడాలి.
- Advertisement -