225 రూపాయలకే కరోనా వ్యాక్సిన్!

54
corona vaccine

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై ట్రయల్స్‌ తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌, రష్యాలు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు పోటీ పడుతుండగా రష్యా ఒకడుగు ముందుకేసి ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

తాజాగా పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా,ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రానున్న కరోనా వ్యాక్సిన ధర సామాన్యులకు అందుబాటులోనే ఉండనుంది. కేవలం రూ.225కే కరోనా వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు ప్రకటించింది సీరమ్ ఇండియా.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్. యూకేలో ఈ వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా.. బ్రెజిల్‌లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో తొలి, రెండో దశలో మనుషులపై ప్రయోగాలు జరుగుతున్నాయి.ఈ వ్యాక్సిన్ ను 92 దేశాల‌కు అందించేందుకు 100 మిలియ‌న్ల వ్యాక్సిన్‌లను అందించేందుకు సిద్ధమవుతోంది.