సీఎం కేసీఆర్‌కు కరోనా నెగటివ్…

31
kcr cm

సీఎం కేసీఆర్ కరోనా నుండి కోలుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం ఫాం హౌస్‌లో కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఫ‌లితం నెగిటివ్‌గా నిర్దార‌ణ అయింది. రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా రాపిడ్ టెస్టులో నెగటివ్‌గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి.

సీఎం కేసీఆర్‌కు స్వ‌ల్పంగా కొవిడ్ ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో యాంటిజెన్ ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించ‌డంతో వ్య‌వ‌సాయ‌క్షేత్రంలోనే సీఎం విశ్రాంతి తీసుకుంటున్నారు.