ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు…

30
suresh

ఏపీలో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించింది జగన్ సర్కార్. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినందుకు అధికారులకు అభినందనలు అని… 5 నుంచి 23 వరకు జరిగే పరీక్షలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్ పై జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని…ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇవి రద్దు కాలేదు… కొన్నిచోట్ల నిర్వహిస్తున్నారు.. మరికొన్ని చోట్ల వాయిదా వేశారని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేసెందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.