కరోనా మందుకు మరో సంవత్సరం పట్టే అవకాశం..

390
corona
- Advertisement -

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సమాచార భవన్‌లో కొవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉస్మానియా హాస్పిటల్ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డా. రాజేంద్ర ప్రసాద్ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్‌ డా. హరికిషన్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్లు రాజేంద్ర ప్రసాద్, హరికిషన్ మాట్లాడతూ.. కరోనా మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వస్తుంది. జంతువుల నుంచి వస్తుందనే ఆధారాలు లేవు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి నేరుగా కాంటాక్ట్ లో ఉండడం గాని లేదా ఆ వైరస్ ఉన్న ఉపరితలాన్ని తాకడం వల్ల సోకుతుందన్నారు.

ఆయా ఉపరితలాలను బట్టి ఈ వైరస్ 4 నుంచి 72 గంటల వరకు ఉంటుంది. సామాజిక దూరం పాటించడం మాస్కులు ధరించడం పరిశుభ్రంగా ఉండడమే దీనికి పరిష్కారం.ఇంట్లో ఎవరికైనా ఫ్లూ లక్షణాలు ఉంటే ఐసోలేట్ చేయాలి.ఏవైనా లక్షణాలపై అనుమానాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలి. లాక్ డౌన్ కరోనా కట్టడికి ఎంతగానో ఉపయోగపడింది. వ్యాక్సిన్ రావడానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉన్నందున ఇప్పుడు పాటిస్తున్న జాగ్రత్తలే పాటించాల్సి ఉంటుంది.ఆల్కహాల్ తాగడం, హాట్ వాటర్‌తో స్నానం చేస్తే కరోనా రాదు అనే వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు.

- Advertisement -