కరోనా వ్యాక్సిన్…మార్గదర్శకాలివే

187
covid
- Advertisement -

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్. కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్‌లో గర్భవతి, పాలిచ్చే మహిళలను భాగంగా చేయలేదని వెల్లడించింది ఆరోగ్య శాఖ.

లబ్ధిదారులు.. ఏదైనా ఒకటే టీకా తీసుకోవాలని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. మొదటి టీకా ఏది తీసుకుంటే.. అదే టీకా రెండో దఫా కూడా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ల ఉపయోగం గురించి లేఖలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది మంత్రిత్వ శాఖ. కోవిడ్ -19 టీకాలు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -