కరోనా సెకండ్ వేవ్…ఆంక్షలు కఠినం చేసిన యూపీ

108
covid
- Advertisement -

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర ,కేరళల్లో రోజుకు వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతుండగా ఆయా రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి పలు రాష్ట్రాలు. తాజాగా యూపీ కూడా ఆంక్షలు కఠినతరం చేసింది.

కేరళ, మహారాష్ట్ర నుంచి యూపీకి వచ్చే ప్రయాణకులు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. రోడ్డు, రైలు, విమాన మార్గాల నుంచి వచ్చే ప్రయాణికులకు యాంటిజెన్ టెస్టులు చేయాలని వెల్లడించింది యూపీ సర్కార్.

పాజిటివ్ వస్తే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలని, అందులో కూడా పాజిటివ్ గా నిర్ధారణ జరిగితే వారిని హోమ్ ఐసోలేషన్ కు తరలించాలని ఆదేశించింది. ఒకవేళ ఆర్టిపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ గా వస్తే వారిని వారం రోజులపాటు హోమ్ క్వారంటైన్ కు తరలించాలని ఆదేశించింది.

- Advertisement -