కరోనా వ్యాక్సిన్‌ ముందుగా అమెరికన్లకే!

238
trump
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై ట్రయల్స్ తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోగా టీకా విషయంలో కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

ప్రాధాన్య‌తా క్ర‌మంలో వ్యాక్సిన్ తొలుత అమెరికన్లకే అందించాలని ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. అమెరికాకు చెందిన వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌లు ప‌లు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న నేప‌థ్యంలో ట్రంప్ ఆదేశాలు న్యాయ స‌మీక్ష‌కు నిల‌బ‌డ‌తాయా లేదా అన్న‌ది సందేహంగా మారింది.

ఫిబ్ర‌వ‌రిలోగా 10 కోట్ల మందికి, జూన్‌లోగా మొత్తం అమెరిక‌న్ల‌కు వ్యాక్సిన్ ఇవ్వాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది అమెరికా. ట్రంప్ సర్కార్ ఆ విధమైన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించిన బైడెన్… తాను అధికారం చేప‌ట్టిన త‌ర్వాత తొలి వంద రోజుల్లోనే 10 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

- Advertisement -