31న నాగోబా జాతర..

15
sathyavathi rathod

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రులు సత్యవతి రాధోడ్, ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి రాథోడ్..ఈ దేవాలయం అభివృద్ధికి మెస్రం వంశీయులు రూ. 4 కోట్లు ఇచ్చి ముందుకు రావడం చాలా గొప్ప విషయం అన్నారు.రామప్ప దేవాలయము, వెయ్యి స్తంభాల గుడి తలపించే విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఆలయ నిర్మాణానికి నిధులు ఇంకా ఎంత అవసరం ఉంటే వాటిని సీఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకొచ్చి మంజూరు చేయిస్తాం అన్నారు.

వచ్చే ఏడాది నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం అని తెలిపిన మంత్రి…సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. సేవాలాల్ మహారాజ్, జంగు భాయ్ జాతర, నాగోబా జాతర ఘనంగా నిర్వహిస్తున్నాం అన్నారు.మేడారం జాతరను బ్రహ్మాండంగా జరుపుతున్నారు.మేడారం నాలుగు జాతరల కోసం 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. గిరిజనుల పట్ల ఉన్న ప్రేమ, అంకితభావానికి నిదర్శనం ఈ పనులు అన్నారు.

జోడేఘాట్ ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం అని తెలిపిన మంత్రి…హైదారాబాద్ లో 30 కోట్ల రూపాయలతో కుమురం భీమ్ భవనం నిర్మిస్తున్నాం అన్నారు.తండాల్లో 3ఫేజ్ కరెంట్ కోసం 250 కోట్ల రూపాయలు ఇచ్చారు. పనులు జరుగుతున్నాయన్నారు.పోడు భూముల సమస్య కూడా తీరబోతుందని…గిరిజనుల రిజర్వషన్లు 10 శాతానికి పెంచాలని తెలంగాణ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందన్నారు.దేశంలో గిరిజనుల ఆరాద్య దైవం నాగోబా జాతర జనవరి 31తేదీన జరుగనుందన్నారు.