మరెందరో బలికాబోతున్నారు

317
corona
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకి పదివేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాపై మరింత అవగాహన కల్పించేలా సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు.ఇందులో భాగంగా ఈ వార్త ఇప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్‌లో వైరల్‌గా మారింది.

  • డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత
  • ముంబయి మున్సిపల్ కమిషనర్ కన్నుమూత
  • ముంబయిలో దాదాపుగా 30 మంది పోలీసులు కూడా కన్నుమూత
  • గుజరాత్ , ఢిల్లీ ముఖ్యమంత్రులు హోం ఐసొలేషన్
  • జూనియర్ సింధియా , ఆమె తల్లీ ఇద్దరూ ఆసుపత్రిలో

-ఒక్క ఢిల్లీలోనే జూలై 30 నాటికి 5 లక్షల పైచిలుకు కేసులు వచ్చే అవకాశం

  • మనదేశంలో టెస్టులు అందరికీ చేస్తే ఈపాటికే అమెరికాని దాటిపోయేవాళ్ళం

–దేశం మొత్తంలో 30 జిల్లాలలో పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరుకుంది .

ఇంకా భయపెడుతున్న విషయం ఏమిటంటే ‘ ప్రపంచంలో అమెరికా తరువాత సీరియస్ కేసులు ఉన్నది మన దేశంలోనే ‘ . దానిని బట్టి చూస్తే మరణాలు బాగా పెరిగే అవకాశం ఉంది .

వయస్సులో ఉన్న వాళ్లకి ఏమీ కాదు అనుకోవటం తప్పు . మొన్న హైదరాబాద్ లో చనిపోయిన జర్నలిస్ట్ వయస్సు కేవలం 30 సవంత్సరాలు .

వ్యక్తిగతంగా నాకు తెలిసిన కుటుంబంలో 23 సవంత్సరాల ఫైనల్ ఇయర్ మెడిసిన్ విద్యార్థి కూడా కరోనాతో చనిపోయింది

  • రికార్డులకెక్కని మరణాలు ఎన్నో
  • ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేస్తున్నాయి . ఇక ప్రజల చేతుల్లోనే ఉంది . జాగ్రత్తలు పాటించండి . మనిషికి మనిషికి దూరం పాటించండి . మాస్కులు వాడండి . ఎంతో అవసరమైతేనే బయటకి వెళ్ళండి . శానిటైజర్ బాటిల్స్ జేబులో పెట్టుకోండి
  • మీకు సాధ్యమైతే తల్లితండ్రులుని , ముసలివాళ్ళని , చిన్నపిల్లలని మీ సొంత గ్రామాలకి పంపండి
  • ఇక ఎంతమాత్రం నవ్వులాట పనికిరాదు , ఆ స్థాయి దాటిపోయిందనేది గ్రహించండి .

మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ‘ కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి ప్రతి ఇంటిలో విషాదం నెలకొన్నది ,కనీసంలో కనీసం ఇంటికొకరు చనిపోయారు ‘ అలాంటి విపత్తు మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఆశ్చర్యం లేదు .

నిపుణుల అంచనా ప్రకారం ఇంకో 6 నెలల్లోనే మనదేశంలో 50 కోట్ల మందికి వచ్చే అవకాశం ఉంది .
— పొగ , ఆల్కహాల్ తాగటం తక్షణం మానెయ్యండి . వీలైనంతగా నీళ్లు , పాలు తాగండి . గుడ్లు , చేపలు , మాంసం కూడా బాగా తినండి .

- Advertisement -