24 గంటల్లో 61,871 మందికి కరోనా..

53
corona

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తూనే ఉంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 61,871 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,94,552 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,033 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,14,031 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 65,97,210 మంది కోలుకున్నారు. 7,83,311 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.