కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న దిశాప‌టానీ..

51
disha

బాలీవుడ్ బ్యూటీ దిశాప‌టానీ ఈ పేరు వినగానే కుర్రాళ్ల రక్తం వేడెక్కుతుంది. ఈ భామ ఇచ్చే ఫోజులకు గుండె కొట్టుకునే వేగం రెండింతలు పెరుగుతుంది. దిశాప‌టానీ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువ‌గా ఫిట్ నెస్ వ‌ర్క‌వుట్స్‌తో త‌న ఫాలోవ‌ర్లు, అభిమానుల‌ను ప‌లుక‌రిస్తుంటుంది. జిమ్‌లో రిస్కీ వ‌ర్క‌వుట్స్ చేస్తూ ఫిట్ నెస్ ల‌వ‌ర్స్ కు ఆద‌ర్శంగా నిలుస్తుంటుంది. తాజాగా ఈ భామ మిర్ర‌ర్ సెల్ఫీతో హంగామా చేస్తోంది.

గ్రే స్పోర్ట్స్ లుక్ లో ఉన్న దిశా మిర్ర‌ర్ సెల్ఫీ దిగి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. స‌న్ డే దిశా పోస్ట్ చేసిన స్ట‌న్నింగ్ లుక్ స్టిల్ ఆన్ లైన్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న భారతీయ నటీమణుల్లో ముందుంది దిశాపటానీ. ఇలాంటి ఫోజులు ఇస్తుండటంతో ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు భారీగా పెరిగిపోతూ ఉన్నారు. ప్రస్తుతం దిశా పటానీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.