‘పుష్ప’లో విలన్‌గా బాలీవుడ్ హీరో..!

479
Allu Arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ని చిత్ర బృందం ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ – మలయాళ – కన్నడ – హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Pushpa

ఇక లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్టులుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కలప దొంగగా బన్నీ కనిపించనున్నాడు.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కీలకమైన పాత్రను చేయనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ .. జాకీ ష్రాఫ్ .. సునీల్ శెట్టి పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నాడట. ఈ ముగ్గురిలో ఒకరిని ఆయన సెట్ చేయనున్నాడని అంటున్నారు.

- Advertisement -