కరోనా మార్గదర్శకాలు పొడగింపు..

120
covid
- Advertisement -

కరోనా మమహమ్మారి నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాల అమలును కేంద్రం మరోసారి పొడిగించింది. ఆగస్టు 31 వరకు గైడ్ లైన్స్‌ని పొడగించినట్లు ఉత్తర్వులు వెల్లడించింది. పండగలోస్తున్నాయి…అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని తేల్చిచెప్పింది కేంద్రం.

కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, ఆర్‌ ఫ్యాక్టర్‌ ఒకటి కన్నా ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం.. రద్దీ ప్రాంతాల్లో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలను ప్రజలు పాటించేలా చర్యలు చేపట్టాలని కోరింది.

కరోనా సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉండాలని పేర్కొంది. ఇప్పటికే కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయిపోయిందనే వార్తలు కూడా ప్రజలను భయపెడుతున్నాయి.

- Advertisement -