దేశంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు..

519
corona
- Advertisement -

భారత్‌లో కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. ఈ క్రమంలో దేశంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ వివరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం.. మనదేశంలో ఇప్పటి వరకు 31,787 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 7,797 మంది కోలుకోగా.. 1008 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 22,982యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరంతా ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Union Health Minister

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 0.33 శాతం మంది మాత్రమే వెంటిటేర్‌పై ఉన్నారని, మరో 1.5 శాతం మంది ఆక్సీజన్ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కేవలం 2.34 శాతం మంది కరోనా బాధితులు మాత్రమే ICUలో ఉన్నారని చెప్పారు హర్షవర్ధన్. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా.. మెరుగైన వైద్య సేవలు వారికి అందుతున్నాయని పేర్కొన్నారు.

అంతేకాదు గత మూడు రోజులు కేసుల డబ్లింగ్ రేటు (రెట్టింపు రేటు) 11.3 రోజులుగా ఉందన్నారు హర్షవర్ధన్. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు 7శాతంగా ఉంటే.. మనదేశంలో 3 శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు. మృతుల్లో 86 శాతం మంది ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే ఉన్నారని స్పష్టం చేశారు. గుండె, మూత్రపిండ సంబంధ వ్యాధులకు కరోనా తోడవడం వల్లే వారు చనిపోయినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

- Advertisement -