మళ్లీ కరోనా విజృంభణ..

80
- Advertisement -

గత రెండు సంవత్సరాలుగా గడగడలాడించిన కరోనా మహమ్మారి కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గతంతో పోలిస్తే చాలావరకు తగ్గాయి. అయితే పూర్తిగా కరోనా లేకుండా పోయే పరిస్థితి కనిపించడం లేదు.. కొన్ని చోట్ల ఇంకా ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. బ్రిటన్‌లో కరోనా కేసులు భారీగా నమోదౌతున్నాయి. ఆసుపత్రుల్లో చేరే వారు, మరణాల రేటు కూడా మరోసారి అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు బీఏ.2 రకానివే ఉంటున్నాయి. మార్చి 26తో ముగిసిన వారంలో 49 లక్షల కేసులు నమోదైయ్యాయి.

ఇక చైనాను కూడా ఈ కరోనా మహమ్మారి పీడిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విదిస్తోంది. ఆదివారం 13,146 కేసులు నమోదయ్యాయి. గతంలో నమోదైన కేసుల కంటే ఇప్పుడు నమోదవుతున్న కేసులే భారీ సంఖ్యలో ఉన్నాయి. కొత్త కేసుల్లో 70 శాతం షాంఘై నుంచే వస్తున్నాయి. కోవిడ్ ఆంక్షలతో ఇక్కడ 2.7 కోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు దక్షిణ కొరియాలో 2,64,171 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇలా చూసూకుంటే ఈ కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశం ఉంది.

- Advertisement -