కరోనా మహామ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. అగ్రదేశాలు సైతం కరోనాతో విలవిలలాడిపోతున్నాయి. ఇక మన దేశంలో కూడా కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజుకి వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 4లక్షల 20వేలు దాటిపోయాయి.రెండు రోజుల్లోనే 30వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం దేశంలో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. లాక్ డౌన్ ఎత్తివేసినప్పటి నుంచి రికార్డు స్ధాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 15,372 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4.26,397కి చేరింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 13,695 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2లక్షల 37వేల మంది కరోనా నుంచి కొలుకున్నారు. మరో లక్షా75వేల మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీలో, తమిళనాడు రాష్ట్రాలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ నాలుగో స్ధానంలో ఉంది.