చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 80కి చేరినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇలా ఉండగా సుమారు 3వేల మంది ఈ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది చైనా ప్రభుత్వం. ప్రతి రోజు దాదాపు 300 నుంచి 500 మందికి ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇక కరోనా వైరస్ చైనాతో పాటు ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. చైనాతో పాటు జపాన్, తైవాన్, నేపాల్, హాంగ్‌కాంగ్, వియత్నాం, మలేషియా, సింగపూర్, దక్షిణకొరియా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు కూడా కరోనా వైరస్ వ్యాపించింది. చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్తున్న వారిని ఎయిర్ పోర్టులలో వైద్య పరీక్షలు నిర్వహించి బయటకు పంపిస్తున్నారు. ఇక రాజస్ధాన్ లోని ఓ మహిళకు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఓ విద్యార్ధి తిరిగి ఇండియాకు రాగా అతనికి కరోనా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు.