మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగు జరుపుకున్న ఈ మూవీ ఇటీవల ఆగిపోయింది. దేశవ్యప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో అన్ని ష్యూటింగులు బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరు ఆచార్య చిత్రీకరణ కూడా నిలిచిపోయింది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ కరోనా ప్రభావంతో ఈ మూవీ విడుదల మరింత ఆలస్యం అయ్యేలా వుందని సినీ వర్గాల సమాచారం.
కరోనాతో ఏర్పడిన ఈ అంతరాయం వలన,చిత్ర యూనిట్ షెడ్యూల్స్ ను మార్చుకోవలసి వస్తుంది. ఆర్టిస్టుల డేట్స్ ను బట్టి షెడ్యూల్స్ ను తిరిగి ప్లాన్ చేయడానికి ఎక్కువ సమయమే పడుతుంది. షూటింగు పరంగా జరుగుతున్న జాప్యం వలన, విడుదల విషయంలోను ఆలస్యం కానుంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.