కళాధర్ కొక్కొండ నటిస్తూ , స్వీయదర్శకత్వం వహిస్తున్న చిత్రం గుణ. నటులు సెల్వరాజ్ , దిల్ రమేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పై రూపోందుతున్న ఈ చిత్రం ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది..
కాగా గుణ టైటిల్ ని ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కొత్త సినిమాకు పెట్టడం పై గుణ చిత్రం నటుడు ,దర్శకనిర్మాత కళాధర్ కొక్కొండ మండిపడుతున్నారు.. ఇదివరకే గుణ టైటిల్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు.. తమ సినిమా టైటిల్ ను అర్జున్ జంధ్యాల టీమ్ వాడుకుంటూ .. ఆ టైటిల్ పక్కన ‘369’ అంకెను తగిలించడం పై కళాధర్ కొక్కొండ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తో పాటు ఎపి ఫిల్మ్ ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు..తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు…
చిత్రం :గుణ,బ్యానర్ : సనాతన క్రియేషన్స్,కథ , స్రీన్ ప్లే, నిర్మాత ,దర్శకత్వం : కళాధర్ కొక్కొండ,డిఓపి అండ్ ఎడిటింగ్ : శ‌్రవణ్ జి కుమార్,సంగీతం : మార్క్ ప్రశాంత్,మాటలు : గుమ్మా విజయ్ కుమార్,పాటలు : అనిల్ ఇనమడుగు