కూటమిలో చీలిక..కాంగ్రెసే కారణమా?

47
- Advertisement -

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, డీఎంకే.. వంటి పార్టీలతో పాటు దాదాపు 26 పార్టీలు సభ్యత్వం కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కాగా కూటమి ఏర్పడినది మొదలుకొని అంతర్గత కుమ్ములాటకు పెరుగుతూనే ఉన్నాయి. కూటమిలో పైచేయి ఎవరిది ? పి‌ఎం అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు కూటమిలో చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. కాగా కూటమిపై ఆధిపత్యం చలాయించేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోందనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి..

అంతే కాకుండా ఇండియా కూటమి తరుపున పి‌ఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉండేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందట. ఈ వ్యవహారమే కూటమిలో చీలికకు కారణమయ్యే ఛాన్స్ ఉందని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. కాగా కూటమి ఏర్పాటులో బిహార్ సి‌ఎం నితీశ్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. కానీ ప్రస్తుతం నితీష్ కుమార్ ను కూటమిలో ఫెడ్ అవుట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తునట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కూటమికి సబంధించి తదుపరి కార్యాచరణ నిమిత్తం రేపు కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్ళీకార్జున్ ఖర్గే నివాసంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అఖిలేశ్ యాదవ్ వంటి కీలక నేతలు డుమ్మా కొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇండియా కూటమిలో ముసలం గట్టిగానే సాగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఐదారు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంలో ఇండియా కూటమిలో ముసలం ఏర్పడితే.. చీలిక వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట. మరి పార్లమెంట్ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:Congress:ఛలో ఢిల్లీ..సీఎం లొల్లి?

 

- Advertisement -