నిత్యావసర ధరల నియంత్రణకు కంట్రోల్ రూం ఏర్పాటు..

286
Control Room
- Advertisement -

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసరాల నిల్వలు, ధరలపై పర్యవేక్షణ ఉండేందుకు పౌరసరఫరాల సంస్థ కేంద్ర కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ టాస్క్ ఫోర్స్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూం 24 గంటలు పనిచేస్తుంది. వినియోగదారులు కంట్రోల్ రూం నెం. 040 23336116కు ఫోన్ చేసి నిత్యావసరాల నిల్వల గురించి తెలుసుకోవచ్చు. నిత్యావసరాలపై వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లయితే ఈ నంబర్ కు ఫోన్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.

అలాగే ఈ కంట్రోల్ రూం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వాహనాల వివరాలను నమోదు చేస్తుంది. ఎల్ పీజీ గ్యాస్ నిల్వలను ప్రతిరోజు సమీక్షిస్తుంది. కంట్రోల్ రూంకు వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది.

- Advertisement -