కార్పొరేట‌ర్ మేక ర‌మేష్ మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

174
miyapur corporator

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని మియాపూర్ కార్పొరేట‌ర్ మేక ర‌మేష్ మృతి చెందారు. అనారోగ్యం కార‌ణంతో ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. మేక ర‌మేష్ మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం వ్య‌క్తం చేశారు.

ఆయ‌న ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు, ఆయన అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి కేటీఆర్ కూడా సంతా పం వ్య‌క్తం చేశారు. ర‌మేష్ మృతి బాధ‌క‌రం అన్నారు.